Share News

AP Elections: పెందుర్తిలో పాగా వేసేదెవరు..?

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:40 AM

అభివృద్ధికి అవ‌కాశాలున్నా.. పాల‌కులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖప‌ట్టణం న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.

AP Elections: పెందుర్తిలో పాగా వేసేదెవరు..?
Pendurthi Candidates

అభివృద్ధికి అవ‌కాశాలున్నా.. పాల‌కులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖప‌ట్టణం న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. దాదాపు 2లక్షల 70 వేల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మహా నగరానికి సమీప నియోజకవర్గం అయినా.. ఉన్నత విద్య, మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉపాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది.


ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంచ గ్రామాల భూ సమస్య ఈ నియోజకవర్గంలో ప్రధానమైనదిగా ఉంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పటికీ పరిష్కరించలేదు. పరిశ్రమల ఏర్పాటు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. పరవాడ ఫార్మాసిటీ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం బారిన పడిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు


2019 ఎన్నికల్లో..

2019 ఎన్నికల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అదీప్ రాజ్ ఎన్నికయ్యారు. పెందుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకాలేదు. గత ఐదేళ్ల ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడి ప్రజలు సంతృప్తితో లేరనేది ఎక్కువమంది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. సంక్షేమ పథకాల అమలు మినహిస్తే చెప్పుకోదగ్గ రీతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంతో ఇక్కడి ఎమ్మెల్యే విఫలమయ్యారు. ఈ ప్రభావం ప్రస్తుత ఎన్నికలపై పడే అవకాశం ఉంది.


ఈ ఎన్నికల్లో..

పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అదీప్‌రాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీకి అనుకూల అంశం. జగన్ ఇమేజ్, పార్టీ బలాన్ని అదీప్‌రాజు నమ్ముకున్నారు. ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే అపవాదు ఆయనపై ఉంది. ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం ఆయన గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఆయనకు కలిసిరాగా.. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. పంచ గ్రామాల భూ సమస్యను ఇప్పటికీ పరిష్కరించకపోవడం వైసీపీకి మైనస్‌గా చెప్పుకోవచ్చు.


జనసేన అభ్యర్థిగా..

పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ బలపర్చిన జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశం. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పంచకర్ల రమేష్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారనే పేరుంది. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో జనసేన అభ్యర్థికి సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం ప్రజలకు సుపరిచితుడు కావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజుపై వ్యతిరేకత పంచకర్ల రమేష్‌బాబుకు ప్లస్‌గా మారనుంది. ద్విముఖ పోరులో ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.

నా గెలుపు ఖాయం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2024 | 09:40 AM