Share News

మావోయిస్టు డంప్‌లో ఏ లభించాయంటే..?

ABN , Publish Date - May 25 , 2024 | 04:32 PM

అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్(Maoist dump) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా(Tuhin Sinha) వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మావోయిస్టు డంప్‌లో ఏ లభించాయంటే..?
Maoist dump at Pansalabanda village

పాడేరు మే 25: అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్(Maoist dump) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా(Tuhin Sinha) వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


డంప్‌లో ఇవి లభ్యమయ్యాయి..

డంప్‌లో స్టీల్ క్యారేజ్ మందుపాత్రలు 6, డైరెక్షనల్ మైన్స్ 2, పేలుడు పదార్థం కేఈఎల్(KEL Company) ఒకటి, 150మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైరు లభించాయన్నారు. పేలుడు పదార్థాలు మావోలకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఎస్పీ గిరిజన ప్రజలకు పలు సూచనలు చేశారు. గిరిపుత్రులందరూ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని... వారి కల్లబొల్లి మాటలు నమ్మెుద్దన్నారు. మావోయిస్టుల కుట్రపూరిత ప్రణాళికలకు బలై పార్టీలో చేరొద్దని హెచ్చరించారు. యువతీ, యువకులు అల్లూరి జిల్లా గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి మంచి పథకాలు అందిస్తున్నాయని వాటిని వినియోగించుకోవాలన్నారు. గిరిజన యువతీ, యువకులు మంచిగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. గతంతో పోలిస్తే మావోల ప్రభావం బాగా తగ్గిపోయిందని నేటి గిరిజన యువత చదువు, ఉద్యోగాలు వైపు వెళ్లడం హర్షించదగ్గ విషయమన్నారు.

ఇవి కూడా చదవండి
Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!
Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు

Updated Date - May 25 , 2024 | 04:34 PM