Share News

TDP: తగ్గేదేలే.. రెడ్ బుక్‌తో సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

ABN , Publish Date - Feb 18 , 2024 | 05:47 PM

సీఎం జగన్ (CM jagan) అర్జునుడు కాదని.. ఆయన ఒక భస్మాసురుడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్‌లో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.

TDP: తగ్గేదేలే.. రెడ్ బుక్‌తో సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

విశాఖపట్నం: సీఎం జగన్ (CM jagan) అర్జునుడు కాదని.. ఆయన ఒక భస్మాసురుడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్‌లో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విశాఖను జాబ్ క్యాపిటల్‌గా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని విరుచుకుపడ్డారు. యూత్ గర్జనకు తాడేపల్లి పిల్లికి తడిసిపోతుందని సెటైర్లు వేశారు. భూ దందాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మార్వో ను కూడా ఈ వైసీపీ నేతలు చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సింహాచలం దర్శనానికి ఎందుకు రావడం లేదని ఓ మహిళ తనను అడిగిందని గుర్తుచేశారు. జగన్‌కు ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికీ వెళ్తాడని సమాధానం ఇచ్చారు. ‘మన డబ్బులు లూటీ చేసి పేపర్, టీవీ లు పెట్టాడు... అవి మన డబ్బులే’ అని చెప్పారు. జగన్‌కు హైదరాబాద్‌లో ఒక ఇల్లు, విశాఖలో, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని...కేవలం రెండు నెలల్లో వాటన్నిటినీ లాక్కుంటామని వార్నింగ్ ఇచ్చారు. విశాఖ రాజధాని అని ఎప్పుడు చెప్పాడో అప్పటి నుంచి ఇక్కడ అనేక విధ్వంసాలు జరుగుతున్నాయని అన్నారు. మద్యపానం నిషేధం చేశాకే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వెళ్తానని జగన్ అన్నాడు... మరీ ఇప్పుడు ఎందుకు ఎన్నికలకు సిద్ధం అయ్యాడు అని ప్రశ్నించారు.


ఆ మంత్రి ఆమ్లెట్లు వేసుకునే పనిలో ఉన్నాడు

లక్ష కోట్లు ఆస్తి, లక్ష రూపాయల చెప్పులు, వెయ్యి రూపాయల నీళ్లు తాగిన జగన్ పెత్తందారుడని మండిపడ్డారు. ఆయన ఒక జలగ మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. గన్నవరం పోర్ట్, కృష్ణ పట్నం పోర్ట్‌లను లాగేశాడని.. ఇదే పరిస్థితి గంగవరం పోర్ట్‌కు కూడా రాబోతుందని హెచ్చరించారు. జగన్ రోజు ఇసుక తింటాడు..ఇసుక పైన రోజుకు 3 కోట్లు రూపాయలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. గూగుల్‌లో 6093 అని కొడితే ఖైదీ జగన్ ఫొటో వస్తుందని ఆక్షేపించారు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫైటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. కరెంట్ చార్జీలు పెంచి బాదుడే బాదుడు.... చెత్త పన్ను పెంచి బాదుడే బాదుడు అని విమర్శించారు. రానున్న రోజుల్లో గాలి పైన కూడా పన్ను వేస్తాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని ఆరోపించారు. అవసరం అయితే విశాఖ ఉక్కును టీడీపీ అధికారంలోకి రాగానే తామే నడిపిస్తామని స్పష్టం చేశారు. కోడి గుడ్డు మంత్రి అమర్నాథ్ ఆమ్లెట్లు వేసుకునే పనిలో ఉన్నాడని సెటైర్లు వేశారు.

ఈ కోడి గుడ్డు మంత్రిని చూసి ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. టి. డి.ఆర్ లు పేరిట లక్షల కోట్లు కుంభకోణం జరుగుతుందన్నారు. ఇప్పుడు జగన్ అన్యాయంగా కడుతున్న భవనాలను తాము అధికారంలోకి రాగానే ..వాటిని ప్రజల కోసం వాడుతామని చెప్పారు. ఏయూలో ప్రసాద్ రెడ్డి అనే ఒక వెదవని పెట్టారని అన్నారు. గతంలో జగన్ వద్దు అన్న ఒక వ్యక్తికి తాము టికెట్ ఇచ్చామని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పక్క ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. స్వర్ణ కారులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ నేతల కోసమే తాను ఒక రెడ్ బుక్కును తయారుచేశానని తేల్చిచెప్పారు. ఈ ఎర్ర బుక్కు పై వైసీపీ ప్రభుత్వం నాన్ బెయిల్‌బుల్ వారెంటి కేసు పెడతామని అంటున్నారని.. వారికి దమ్ము ఉంటే రావాలని.. తాను ఈరోజు విశాఖలోనే ఉన్నానని సవాల్ విసిరారు.తనపైన కూడా సైకో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కేసు, అలాగే 22 కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు.అయినా సరే తాను తగ్గేదేలేదని సవాల్ విసిరారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తనకు పవన్ అన్న అండగా నిలబడ్డారని తెలిపారు. అప్పుడు ఆయన్ని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఈ పేటియం బ్యాచ్‌కు ఏం పని లేదని విరుచుకుపడ్డారు. 5 రూపాయలు ఇస్తే పనికిమాలిన పోస్టులు పెడుతున్నారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 08:29 PM