Share News

Botsa Satyanarayana: ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు.. టీడీపీపై బొత్స ఆగ్రహం

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:04 PM

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఆపేయాలని ఎవరు ఎన్నికల కమిషన్‌కు వెళ్లారని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తిరిగి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Botsa Satyanarayana: ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు.. టీడీపీపై బొత్స ఆగ్రహం

విశాఖపట్నం, ఏప్రిల్ 1: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ (AP Government) ప్రకటనపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఆపేయాలని ఎవరు ఎన్నికల కమిషన్‌కు వెళ్లారని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తిరిగి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నూటికి నూరు శాతం పేదవాడి మీద కక్షతో, పేదవాడికి అందకుండా చూడాలని బుద్ధితో ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

ఫోరం ఫర్ సిటిజన్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh) లాంటి వ్యక్తులు, చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) వత్తాసు పలికేందుకు ఇదంతా చేశారని దీనిని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు. చంద్రబాబు నంగనాచిలా ప్రత్యేక ఏర్పాటు చేయాలని లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ ఇవ్వడంలో అక్కడ అవినీతి జరిగిందంటే తాను తలదించుకొని వస్తానన్నారు. వాలంటీర్ వ్యవస్థలోఎవరో తప్పు చేస్తే అందరికీ దాని ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. పెన్షన్ పంపిణీకి ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. వాలంటీర్లో, తాత్కాలిక ఉద్యోగులైనా మెర్సి లెటర్ పెట్టుకుంటే కన్సిడర్ చేస్తారని... అలాంటిది వారికి అవకాశాలు ఉండవా అని అన్నారు. ఎన్నికల ముందే ప్రజలు తిరిగి పెన్షన్ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్‌ను తెచ్చుకుని దుస్థితి తీసుకువచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి...

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

Kejriwal: తీహార్ జైలులో కేజ్రీవాల్ దినచర్య ఇలా...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 01 , 2024 | 03:09 PM