Share News

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:20 PM

బాపట్ల: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ కు ఘోర పరాభవం ఎదురైంది. ‘అంతా మా ఇష్టం.. మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదు’ అన్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ సురేష్‌కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

బాపట్ల: వైసీపీ ఎంపీ (YCP MP) నందిగం సురేష్‌ (Nandigam Suresh)కు ఘోర పరాభవం ఎదురైంది. ‘అంతా మా ఇష్టం.. మాకు ఎలక్షన్ కోడ్ (Election code) వర్తించదు’ అన్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ సురేష్‌కు సొంత పార్టీ నేతల (YCP Leaders) నుంచి వ్యతిరేకత ఎదురైంది. అద్దంకి నియోజక వర్గం పరిధిలోని బల్లికురువ మండలం, కొప్పెరపాడు గ్రామంలో చర్చి (Church)లోకి పార్టీ జెండాలు, కండువాలతో ఎంపీ ప్రవేశించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ హనిమిరెడ్డి (YCP in charge Hanimireddy) తో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఇంతలోగా ఫాన్ పార్టీ మరో వర్గానికి చెందిన మహిళలు (Womens) పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న ఎంపీని, ఇన్చార్జిని చర్చిలోనుంచి బయటకు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఎంపీ మాటను లెక్కచేయని మహిళలు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఎంపీ సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Apr 01 , 2024 | 01:22 PM