Share News

Vishnukumar raju: గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ

ABN , Publish Date - Mar 23 , 2024 | 04:28 PM

Andhrapradesh: విశాఖ గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని బీజేపీ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Vishnukumar raju: గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ

విశాఖపట్నం, మార్చి 23: విశాఖ (Visakhapatnam) గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని బీజేపీ విష్ణుకుమార్ రాజు (BJP Leader Vishnukuamar Raju) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయన్నారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం (AP Government) విఫలమైందని విమర్శించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌పై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డగ్స్ వ్యవహరంపై కులాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి (AP BJP Chief Purandeshwari), వారి బంధువులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం బీజేపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది


ఆ ఘనత జగన్‌రెడ్డికే..

సీబీఐను అడ్డుకున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిదే (CM Jaganmohan Reddy) అంటూ వ్యాఖ్యలు చేశారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమన్నారు. విశాఖ ఎయిర్ ఫోర్టులో (Visakha Airport) చంద్రబాబుపై (TDP Chief Chandrababu naidu కోడిగుడ్లు వేసిన పార్టీ వైసీపీ అంటూ విరుచుకుపడ్డారు. కేకే రాజు తనపై దుష్పచారం చేస్తున్నారని.. కేకే రాజు చేస్తున్న పనులు ప్రజలందిరికి తెలుసన్నారు. మహిళలు అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. తన వలన మహిళలు ఎవ్వరైనా ఇబ్బంది పడితే క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. మహిళల పుస్తులును జగన్ తెంచుతున్నారని విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి...

Trending Video: రొమాంటిక్ సాంగ్.. రంగులతో హల్చల్.. దిల్లీ మెట్రోలో యువతుల రచ్చ..

Viral Video: కోతులను ఎలా కూల్ చేయాలో.. ఇతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనుకుంటా..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 23 , 2024 | 04:32 PM