Share News

AP: ముగిసిన సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ.. సీఈసీకి ఏం చెప్తారు?

ABN , Publish Date - May 15 , 2024 | 09:01 PM

ఏపీ(AP)లో ఇటివల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలక అధికారులైన సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ సహా పలువురు అధికారుల సమక్షంలో జరిగిన భేటీ తాజాగా పూర్తైంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాల్సిన అంశాలపై అధికారులు ఈ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

AP: ముగిసిన సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ.. సీఈసీకి ఏం చెప్తారు?
ap CS, DGP and Intelligence Chief meeting over

ఏపీ(AP)లో ఇటివల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలక అధికారులైన సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ సహా పలువురు అధికారుల సమక్షంలో జరిగిన భేటీ తాజాగా పూర్తైంది. ఈ సమావేశం దాదాపు గంటకుపైగా జరుగగా, ప్రధానంగా మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారన్నదానిపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏం వివరణ ఇవ్వాలని అధికారులు చర్చించారు.


దీంతోపాటు ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న ఘటనలు అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి(central election commission) నివేదిక ఇవ్వాలని భావిస్తున్నారు సీఎస్, డీజీపీ. ఈ క్రమంలో మాచర్లలో 144 సెక్షన్, కేసుల నమోదు, అరెస్ట్‌లపై డీజీపీ సీఈసీకి వివరించనున్నారు. ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు, ఎవరిపై కేసులు నమోదయ్యాయనే సహా పలు అంశాలను తెలుపనున్నారు. అయితే ఇటివల ఏపీలో పోలింగ్ జరిగిన క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సీఈసీకి వివరించాల్సిన అంశాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 09:08 PM