Share News

AP Politics: టీడీపీ శ్రేణులపై బీర్ సీసాలు.. రాళ్లు, కర్రలతో వైసీపీ దాడికి యత్నం

ABN , Publish Date - May 15 , 2024 | 07:46 PM

ఏపీలో ఎన్నికలు(ap elections 2024) పూర్తై రెండు రోజులైనా కూడా వైసీపీ(YSRCP) కార్యకర్తల కవ్వింపు చర్యలు మాత్రం తగ్గడం లేదు. టీడీపీ(TDP) కార్యకర్తలు కనిపిస్తే చాలు వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా(Krishna District) మచిలీపట్నం బలరాంపేటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నించారు.

AP Politics: టీడీపీ శ్రేణులపై బీర్ సీసాలు.. రాళ్లు, కర్రలతో వైసీపీ దాడికి యత్నం
YCP leaders attempt to attack TDP leaders

ఏపీలో ఎన్నికలు(ap elections 2024) పూర్తై రెండు రోజులైనా కూడా వైసీపీ(YSRCP) కార్యకర్తల కవ్వింపు చర్యలు మాత్రం తగ్గడం లేదు. టీడీపీ(TDP) కార్యకర్తలు కనిపిస్తే చాలు వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా(Krishna District) మచిలీపట్నం బలరాంపేటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు బీరు సీసాలు, రాళ్లతో కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ఏజెంట్ల మధ్య చిన్న వివాదం నేటి దాడికి కారణమైనట్లు తెలుస్తోంది.


సమాచారం తెలుసుకున్న పోలీసులు మచిలీపట్నం బలరాంపేట(Balaramunipet)లో స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోంకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ వెల్లడించారు. మరోవైపు ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటోందని స్థానికులు మరింత భయాందోళన చెందుతున్నారు.


ఇది కూడా చదవండి:

AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 07:50 PM