Share News

Exams: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్

ABN , Publish Date - Mar 18 , 2024 | 09:37 AM

Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్‌ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.

Exams: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్

అమరావతి, మార్చి 18: ఏపీలో (Andhrapradesh) పదో తరగతి పరీక్షలు (Tenth Exams) మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్‌ అయినవారు 1,02,528 మంది ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్సుల్లో హాల్‌టికెట్లు చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి...

AP News: 33 మంది వలంటీర్ల తొలగింపు.. కారణమేంటో తెలిస్తే..

Kolkata: కోల్‌కతాలో ఘోరం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. భారీగా ప్రాణ నష్టం!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 18 , 2024 | 09:52 AM