Share News

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

ABN , Publish Date - Apr 06 , 2024 | 07:32 PM

సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

అమరావతి: సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.


Chandrababu: రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిశా.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన శ్రీమతి జాన్సీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఎందుకు మీటింగ్ పెట్టారని ప్రశ్నించారు. ఆ సమావేశంలో ప్రభుత్వ వాహనాలు వాడారని వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరామని చెప్పారు. టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థులపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని అడిగామన్నారు.

పెన్షన్లు ఆలస్యం కావడానికి చంద్రబాబు కారణమని, క్యారికేచర్ వేశారని మండిపడ్డారు. చంద్రబాబపై వైసీపీ నేతలు తప్పడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారని ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయరని నిలదీశారు.


Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే

వెంకట్రామిరెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా ఇచ్చిన లేఖ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోషియేన్ ఇచ్చిన లేఖ కాదని చెప్పారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోషియేన్ మీటింగ్ జరుగకుండానే కాంతిరాణ టాటా లేఖ రాశారని అన్నారు. ఆయన టేబుల్ సొరుగులో నుంచి తీసి రాసిన లేఖ అని తెలిపారు.

ఐపీఎస్ ఆఫీసర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, సెక్రెటరీ లేఖ ఇవ్వాలని చెప్పారు. కార్యవర్గ సభ్యులు కాంతిరాణ టాటా లేఖ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంతిరాణ టాటా వ్యక్తిగతంగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డికు బాగా కావలసిన వ్యక్తి అని వర్లరామయ్య అన్నారు.


Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

ఆ అధికారి లేఖ రాయడం సమంజసం కాదు: దేవినేని ఉమ

విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా రెండోసారి ఇలా లేఖ రాయడం సమంజసం కాదని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడ కమిషనర్ లేఖ రాయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డితో పాటు ఉన్న ఆర్టీసీ ఎంప్లాయిస్ సస్పెండ్ అయ్యారని చెప్పారు. వెంకట్రామిరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి వైసీపీ కరపత్రాలు పంచలేదా అని నిలదీశారు. కొంతమంది అక్రమార్కులు జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.


YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 07:52 PM