Share News

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

ABN , Publish Date - Jan 25 , 2024 | 03:40 PM

Andhrapradesh: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

శ్రీకాకుళం, జనవరి 25: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల మాటలు చూసి జాలేస్తోందని.. షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. కేంద్రానికి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే.. ప్రధాని మోడిని కలిశారన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాలు కోఆర్డినేషన్‌తో వెళ్లాలని అన్నారు. తాము మూడు రాజధానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కొడుతోందన్నారు. ప్రతిపక్షాలకు అధికారం కావాలి... తమకు సంక్షేమం కావాలన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని... మరో డెబ్బై రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రశ్నించారు.


గంటా రాజీనామాపై...

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivasrao) స్వయంగా రాజీనామా ఇచ్చారన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో లెటర్ రాసి స్పీకర్‌ను కలిసే రాజీనామా విషయం చెప్పారన్నారు. ఆయన స్వలాభం కోసం రాజీనామా చేశారా?.. దానిని తమపై ఆపాదిస్తే ఎలా? అంటూ మండిపడ్డారు. లోకేష్ (TDO Leader Nara lokesh) ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందన్నారు. పాదయాత్ర చేసిన లోకేష్ శ్రీకాకుళం రాకుండానే ప్యాకప్ అయిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

త్వరలో పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అదించాం... ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై కార్యకర్తలకు ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2024 | 03:40 PM