Share News

AP Politics: చంద్రబాబు కాళ్లు పట్టుకున్న కాకాణితో చర్చకి రావాలా? మాజీమంత్రి సోమిరెడ్డి

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:54 PM

వ్యవసాయంపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్‌పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

 AP Politics: చంద్రబాబు కాళ్లు పట్టుకున్న కాకాణితో చర్చకి రావాలా? మాజీమంత్రి సోమిరెడ్డి

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP), వైఎస్ఆర్ సీపీ (YSRCP) ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అంశాల వారీగా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. వ్యవసాయంపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్‌పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

సోమిరెడ్డి ఏమన్నారంటే..?

‘మంత్రి కాకాణి గోవర్ధన్‌‌కు కంటి సమస్య వచ్చింది. అందుకోసమే వ్యవసాయంపై చర్చకు రావాలని చంద్రబాబును పిలిచారు. గతంలో కాకాణిపై ఉన్న కేసుల గురించి సోమిరెడ్డి ప్రస్తావించారు. కేసుల నుంచి బయట పడేయాలని చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదా.? మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో కూర్చొలేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల గురించి కాకాణిలో కంగారు మొదలైంది. నకిలీ పత్రాల, కోర్టు దొంగతనాలు, కల్తీ మద్యం కేసులు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సర్వేపల్లిలో కాకాణి గెలవరు. మూడోసారి గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న కాకాణితో ఆయన చర్చకి రావాలా..? అని’ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

సోమిరెడ్డి సెటైర్లు

నెల్లూరులో చంద్రబాబు నాయుడు రా.. కదలిరా.. బహిరంగ సభ దిగ్విజయం అయ్యిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. వైసీపీ హయాంలో ఆర్బీకేలు భక్షక కేంద్రాలుగా మారాయిని విమర్శించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ఏపీ సీఎం జగన్ సభలు నిర్వహిస్తున్నారని సోమిరెడ్డి సెటైర్లు వేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 01:54 PM