Share News

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

ABN , Publish Date - Mar 23 , 2024 | 07:28 PM

సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

విశాఖపట్నం: సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీని 12వ స్థానానికి తెచ్చారని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెం1 స్థానంలో ఉంటే.. నేడు వైసీపీ పాలనలో గంజాయి అక్రమ రవాణాలో నెం.1 స్థానంలో ఉందని అన్నారు. బ్రెజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు రూ.50వేల కోట్ల డ్రగ్స్ వచ్చిందని చెప్పారు. యువత వైసీపీ మాయలో పడకుండా ఓటు ద్వారా తమ భవిష్యత్‌ను బంగారు మయంగా మార్చుకోవాలని ప్రణవ్ గోపాల్ సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 07:28 PM