ఆ పని చేస్తే చెయ్యి తీసేస్తా.. : పెమ్మసాని చంద్రశేఖర్

ABN, Publish Date - Apr 24 , 2024 | 10:00 PM

వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో (BIG Debate) మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టినా పోరాడేందుకు వ్యవస్థలు ఉన్నాయన్నారు. కేసులు పెట్టి ఎన్ని రోజులు నిర్భందించగలరని ప్రశ్నించారు. ఆరు నెలలో, ఏడాదో జైల్లో పెడతారని.. అలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును ఇబ్బంది పెట్టినట్లుగా ఇబ్బందిపెట్టి, భౌతికదాడి చేస్తే ఏం చేయగలరని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకమని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి తనను కొట్టినవాడి చెయ్యిని తీసేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Updated at - Apr 24 , 2024 | 10:00 PM