Share News

Srisailam Temple: స్వామివారి యాగశాల ప్రవేశంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

ABN , Publish Date - Mar 01 , 2024 | 09:34 AM

Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో పెద్దిరాజు,చైర్మన్ దంపతులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది.

 Srisailam Temple: స్వామివారి యాగశాల ప్రవేశంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

నంద్యాల, మార్చి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavam) వైభవంగా మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో పెద్దిరాజు, చైర్మన్ దంపతులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది. ఈరోజు నుంచి ఈనెల 11వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపటి (శనివారం) నుంచి శ్రీ స్వామి అమ్మవారికి వివిధ వాహనసేవలు, శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు (EO Peddiraju) స్పష్టం చేశారు. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. కాగా శివ స్వాములకు ఈ నెల 5 తేదీ వరకు విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.


బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..

  • 1న శ్రీస్వామివారి యగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు మొదలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

  • 2న భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు

  • 3న హంస వాహన సేవ జరగనుండగా... విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పించనున్నారు.

  • 4న మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పించనున్నారు.

  • 5న రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.

  • 6న పుష్పపల్లకీ సేవ

  • 7న గజవాహన సేవ

  • 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం

  • 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు

  • 10న ధ్వజావరోహణం

  • 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Fake News: రోత ముఠా...ఫేక్‌ రాత!


TDP: పత్తిపాటి పుల్లారావు కుమారుడికి 14 రోజుల‌ రిమాండ్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 09:37 AM