Share News

TDP: పత్తిపాటి పుల్లారావు కుమారుడికి 14 రోజుల‌ రిమాండ్

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:56 AM

విజయవాడ: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు ‌శరత్‌ను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. రిమాండ్‌పై రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. 14 రోజుల‌ పాటు రిమాండ్‌ విధించారు.

TDP: పత్తిపాటి పుల్లారావు కుమారుడికి 14 రోజుల‌ రిమాండ్

విజయవాడ: టీడీపీ (TDP) నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) కుమారుడు ‌శరత్‌ (Sharath)ను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. రిమాండ్‌పై రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. 14 రోజుల‌ పాటు రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు శరత్‌ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వేయని రోడ్లకు ప్రభుత్వం నుంచి ‌ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్‌గా పొందినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా శుక్రవారం తెల్లవారుజాము‌ వరకు టీడీపీ నేతలు పత్తిపాటి పల్లా రావు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమ,‌ కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా , బోడే ప్రసాద్, పట్టాభి, ఇతర నేతలు జడ్జి నివాసం వద్దే ఉన్నారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. ఎఫ్‌ఐఆర్‌లో పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 06:59 AM