Byreddy Rajasekhar Reddy: రుషికొండ ప్యాలెస్సే జగన్‌కు రాజకీయ సమాధి
ABN , Publish Date - Jun 17 , 2024 | 09:00 PM
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. రుషి కొండ ప్యాలెస్సే జగన్‌కు రాజకీయ సమాధి అని ఆరోపణలు చేశారు.2019 ఎన్నికల్లో ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నామా అని జగన్‌ను జనం ఛీ కొడుతున్నారని మండిపడ్డారు.
నంద్యాల: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. రుషి కొండ ప్యాలెస్సే జగన్‌కు రాజకీయ సమాధి అని ఆరోపణలు చేశారు.2019 ఎన్నికల్లో ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నామా అని జగన్‌ను జనం ఛీ కొడుతున్నారని మండిపడ్డారు. జగన్ మళ్లీ బయటకు వస్తా అంటున్నారని.. వస్తే జగన్‌పై జనం చెప్పులు, బూట్లు వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని విమర్శించారు.
ప్రతి పేద కుటుంబం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శ్రమిస్తారని కొనియాడారు. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నందికొట్కూరులో కొంతమంది వలంటీర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు వసూల్ చేశారని తెలిసిందన్నారు. ఇలాంటివి చంద్రబాబు అస్సలు సహించరని.. టీడీపీకి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తే తోలు తీసి కుట్లు వేస్తానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.