Share News

Devineni Uma: స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:26 PM

స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి(CM Jagan) అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Devineni Uma: స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

అమరావతి: స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి(CM Jagan) అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువుల ఇళ్లల్లో, కార్యాలయాలపై సీఐడీ అధికారులు చేసిన రైడ్స్ జగన్ రెడ్డి కక్షసాధింపుల్లో భాగమేనని చెప్పారు. ప్రభుత్వ పరిధిలోకి రాని విషయాలను పట్టుకొని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌పై అక్రమ కేసులు పెట్టించి, జైలుకు పంపారని విరుచుకుపడ్డారు. కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ రూ.8కోట్ల ట్యాక్స్ మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ డీజీజీఐ(DGGI) విచారణ చేపట్టిందని తెలిపారు. ఆ కంపెనీ ఎండీ జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారని కంపెనీ తరుపున జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యుడినని ఒప్పుకున్నారని చెప్పారు. అలెక్సా సంస్థకు రాష్ట్ర సీఆర్డీఏతో ఎలాంటి సంబంధంలేదని ఆ సంస్థ అధికారులే చెప్పారని గుర్తుచేశారు.

ఈ విషయాలన్ని జగన్ రెడ్డికి తెలిసీ కూడా కావాలనే రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డి అనే ఇద్దరు అధికార్లను పట్టుకొని వారి ద్వారా ప్రత్తిపాటి శరత్‌ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. అలెక్సా సంస్థ ఎండీ జోగేశ్వరరావుని కాదని, 3 నెలల క్రితం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శరత్‌ను వేధించడం జగన్ సైకో చర్యల్లో భాగమేనని అన్నారు. రాజేశ్వర్ రెడ్డి ద్వారా ఏపీఎస్‌ర్డీఐ(APSRDI)కి లేఖ రాయించిన జగన్ ఆ వెంటనే తన చేతిలోని సంస్థలను పుల్లారావు కుటుంబంపైకి పంపారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంతో తనకు, తన ప్రభుత్వానికి ఏం సంబంధమో జగన్ రెడ్డే చెప్పాలని ప్రశ్నించారు. అలెక్సా సంస్థ రోజువారీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధంలేని శరత్‌పై అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపిన జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అమరావతి రైతులను, ఏపీలో ఉన్న 5 కోట్ల ప్రజలను బతికించిన న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని చెప్పారు. 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు జగన్ రెడ్డి బాధితులంతా క్యూకడతారని అన్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే జగన్ రెడ్డి బోడిగుండుగా మార్చిన రుషికొండకు వెళ్తారని అన్నారు. ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచి లండన్‌కు పారిపోతారని ఎద్దేవా చేశారు. లండన్లో దాక్కోవడానికి ఇప్పటికే అక్కడ భవనాలు కొన్నారని తమకు సమాచారం ఉందని దేవినేని ఉమ తెలిపారు.

ఇవి కూడా చదవండి...

Vasanta Krishanprasad: నేటి నుంచే టీడీపీ కుటుంబంలో నా అడుగులు..

AP News: గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 03:26 PM