AP News: ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ జీవో జారీ
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:21 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అడ్వకేట్ జనరల్‌గా (Advocate General) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను (Dammalapati Srinivas) నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో (GO) జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు (Satya Prabhakar Rao) ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఏపీ అడ్వకేట్ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు అయ్యారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు నోట్ ఫైల్ వెళ్లింది. దీంతో ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ప్రతిపాదనలు పంపారు. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఏజీగా దమ్మాలపాటి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి 2014 జూన్ 30 నుంచి 2016 మే వరకు అదనపు అడ్వకేట్ జనరల్(ఏఏజీ)గా సేవలు అందించారు. 2014 జూన్ నుంచి ఏజీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ఆయన సేవలు అందించారు. ఈ అనుభవమే ప్రస్తుతం ఆయన రెండోసారి ఏజీగా నియమితులయ్యేందుకు దోహదపడింది. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దమ్మాలపాటిపై క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వాటన్నిటినీ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో ఉంచిన సందర్భంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జరిపిన న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీలకపాత్ర పోషించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి చేసిన వారిని వదలం: మంత్రి పొన్నం
ఎన్డీఏ కూటమి విజయంతో అమెరికాలో ఎన్నారై సంబరాలు.
జగన్‌కు సచివాలయం నుంచి నోటీసు..
అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News