Share News

AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:46 AM

గుడివాడ పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) హారతి పట్టేవారికి బహిరంగంగానే రూ.1,000 పళ్లెంలో వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా హారతి పళ్లెంలో డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది.

AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాయిలాలు

పత్తాలేని ఎన్నికల అబ్జర్వర్‌ టీమ్‌

గుడివాడ: గుడివాడ పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) హారతి పట్టేవారికి బహిరంగంగానే రూ.1,000 పళ్లెంలో వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా హారతి పళ్లెంలో డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ నెల 2వ తేదీన ఇదే తరహాలో హారతి పట్టిన వారికి పళ్లెంలో నాని నగదు వేసిన విషయాన్ని టీడీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారులు స్పందించలేదు. నాని ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము బహిరంగంగా ఆరోపిస్తున్నా ఎన్నికల అధికారుల్లో చలనం లేదు.

Updated Date - Apr 12 , 2024 | 09:24 AM