Share News

AP News: వారికి పదోన్నతి ఎలా కల్పిస్తారు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ABN , Publish Date - Mar 28 , 2024 | 06:21 PM

ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఐదుగురు పిటీషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్ల వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.

AP News: వారికి పదోన్నతి ఎలా కల్పిస్తారు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

అమరావతి: ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఐదుగురు పిటీషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్ల వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ప్రిన్సిపాళ్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నిచింది. సిలబస్, పాఠ్యాంశాలపై లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు ఏమి అవగాహన ఉంటుందని నిలదీసింది. ఈ జీవో ఇచ్చిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపించాలని మందలించింది. సర్వీస్ ఉందని స్వీపర్‌ను కూడా ప్రిన్సిపాల్‌గా నియమిస్తారేమోనంటూ హైకోర్టు ఎద్దేవా చేసింది.

AP News: అమరావతి రైతుల పోరాటంపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

అసమర్థులను విద్యాసంస్థలకు అధిపతులుగా నియమిస్తే.. వాటి తలరాతలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ చర్యలను అనుమతిస్తే విద్యా వ్యవస్థ విధ్వంసానికి దారి తీస్తుందని మండిపడింది. జీవోపై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. జూనియర్ కాలేజీల్లో 197 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ విచారణను ఏప్రిల్ 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 06:26 PM