Share News

AP Politics: జగన్ యుద్ధానికి కాదు... ఓడిపోడానికి సిద్ధం

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:52 PM

అమరావతి సంపదను సీఎం జగన్ (CM Jagan) దోచేశారని మూడు రాజధానులు శిబిరం నిర్వాహకుడు గురునాధం (Gurunadham) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఉద్యమం వసూలు డబ్బులు ఏమైపోయాయని ప్రశ్నించారు.

AP Politics: జగన్ యుద్ధానికి కాదు... ఓడిపోడానికి సిద్ధం

అమరావతి: అమరావతి సంపదను సీఎం జగన్ (CM Jagan) దోచేశారని మూడు రాజధానులు శిబిరం నిర్వాహకుడు గురునాధం (Gurunadham) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఉద్యమం వసూలు డబ్బులు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఉద్యమం పేరిట వసూలు చేసిన రూ. 100 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో ప్రభుత్వ సలహాదారు సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బుల ఆశజూపి ఐదేళ్లు మూడు రాజధానులు శిబిరంలో పేదలు, దళితులను జగన్ కూర్చో బెట్టారని మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది, అరాచకవాది అని ఆరోపించారు. దళితులను నమ్మించి, నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.


Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు

పేదల ఓట్లకోసం జగన్ ఆడుతున్న జగన్నాటకమే ఇదన్నారు. ట్రక్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కాదని సీఎం స్థానం ఇవ్వాలని అన్నారు. రానున్న ఎన్నికలతో జగన్ తాడేపల్లి కోటకి పరిమితం కాబోతున్నారని విమర్శించారు. దళితుల ద్రోహి జగన్ అని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడడంలో జగన్ దిట్ట అని ఎద్దేవా చేశారు. విశాఖ కోడికత్తి... బాబాయ్ వివేకా మర్డర్ గత ఎన్నికల్లో బాగానే వాడుకున్నారని దెప్పిపొడిచారు. నిన్న రాళ్ల దాడి అంటూ సరికొత్త డ్రామాకు తెరదేశారని ఎద్దేవా చేశారు.


TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

మూడు రాజధానుల ఉద్యమమే జగన్ రాజకీయ భవిష్యత్‌కి సమాధి కట్టబోతోందని హెచ్చరించారు. దళితులను కట్టు బానిసలుగా వాడుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఆ కట్టుబానిసలే కట్టప్పలా ఎన్నికల్లో పోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల శ్రమను పెట్టుబడిగా పెట్టి జగన్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. పేదల రక్తం పీల్చి...పేదలకే సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతున్నారని మండిపడ్డారు.


బహుజనులారా జగన్‌ను నమ్మొద్దన్నారు. జగన్ పెత్తందారీ అని ఆరోపించారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రావణకాష్టం అవుతుందని హెచ్చరించారు. జగన్ యుద్ధానికి సిద్ధం కాదని...ఓడి పోడానికి సిద్ధమని సెటైర్లు గుప్పించారు. రాష్ట్రం మొత్తం తిరిగి జగన్ అరాచకాన్ని, అవినీతిని ప్రజలకు వివరిస్తానని గురునాధం తెలిపారు.

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 10:22 PM