Share News

AP Politics: మరోసారి బయటపడ్డ వైసీపీ ఓట్ల బాగోతం.. స్కూలు పిల్లలను కూడా వదలట్లేదు కదా..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:41 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల కోసం అధికార వైసీపీ(YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. దొంగ ఓట్లతో మరోసారి అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంతగానో హెచ్చరించినా జగన్ పార్టీ మాత్రం ఓట్లల్లో అక్రమాలకు పాల్పడుతునే ఉంది.

AP Politics: మరోసారి బయటపడ్డ వైసీపీ ఓట్ల బాగోతం.. స్కూలు పిల్లలను కూడా వదలట్లేదు కదా..!

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల కోసం అధికార వైసీపీ(YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. దొంగ ఓట్లతో మరోసారి అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్ పార్టీ మాత్రం ఓట్లల్లో అక్రమాలకు పాల్పడుతునే ఉంది. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేసి గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. మూడేళ్ల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేసి గెలిచిందని కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణలో రుజువు అయింది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు కూడా చేపట్టారు. అయినా జగన్ పార్టీ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చనిపోయిన వారిని కూడా ఫ్యాను పార్టీ వదలడం లేదు. అలాగే డబుల్ ఓట్లను కూడా వైసీపీ.. ఓటర్ల జాబితాలో చేర్చింది.

ఏపీలో జగన్ రాజ్యాంగం..?

అంతటిలో ఆగకుండా ఇప్పుడు పాఠశాలల విద్యార్థులను కూడా వదలడం లేదు. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించాలి.. కానీ ఏపీలో జగన్ రాజ్యాంగం నడుస్తోండటంతో ఎంచక్కా స్కూలు పిల్లలకు కూడా ఓటు హక్కును కల్పించింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో స్కూల్ విద్యార్థులకు ఓటు హక్కును దొంగతనంగా ఓటర్ల లిస్టులో జొప్పించింది. ఈ ఓట్ల లిస్టును చూసిన స్కూలు విద్యార్థులే ముక్కున వేలేసుకుంటున్నారంటే వైసీపీ ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది గమనించిన ప్రతిపక్షాల నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఓటు హక్కు పొందిన స్కూల్ విద్యార్థులు వీరే..

1) ఓర్సు చంద్రకళ - 9వ తరగతి గర్ల్స్ హైస్కూల్ సత్తెనపల్లి - ఓటర్ సీరియల్ నంబర్: 1039

2) ఓర్చు శివ గోపి - 10వ తరగతి పాపాయిపాలెం జెడ్పీ హైస్కూలు - ఓటర్ సీరియల్ నంబర్:1037

3) కూరాకుల హిమబిందు - కస్తూర్బా పాఠశాల - 10వ తరగతి బెల్లంకొండ అడ్డరోడ్డు ఓటర్ సీరియల్ నంబర్:1027

4) తమ్మిశెట్టి మహాలక్ష్మి - 8వ తరగతి గర్ల్స్ హై స్కూల్ సత్తెనపల్లి - ఓటర్ సీరియల్ నంబర్:1028

5) ఓర్చు లక్ష్మీ తిరుపతమ్మ - ఏడో తరగతి డ్రాప్ ఎమ్మాజీ గూడెం పాఠశాల - ఓటర్ సీరియల్ నంబర్: 1026

6) రావూరి మనోజ్ కుమార్ - 10వ తరగతి పాపాయపాలెం జెడ్పీ హైస్కూల్ - ఓటర్ సీరియల్ నంబర్: 1031

7) తురక నీలిమ - 9వ తరగతి పేరంచర్ల ప్రైవేట్ పాఠశాల - ఓటర్ సీరియల్ నంబర్:1040

8) నంద్యాల వాసవి - 9వ తరగతి గర్ల్స్ హై స్కూల్ సత్తెనపల్లి - ఓటర్ సీరియల్ నంబర్:1048

9)బత్తుల శివ పూజిత - ఎనిమిదో తరగతి దాచేపల్లి మండలం క్యాసంపల్లి ప్రైవేట్ పాఠశాల - ఓటర్ సీరియల్ నంబర్: 1052

10) జల్లి దివ్య - ఇంటర్ మొదటి తరగతి శాంతినికేతన్ కాలేజీ సత్తెనపల్లి - ఓటర్ సీరియల్ నంబర్:1053

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 04:43 PM