Share News

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:00 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ఈరోజు(బుధవారం) కాసేపటి క్రితమే ప్రారంభమైంది.

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

ఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ఈరోజు(బుధవారం) కాసేపటి క్రితమే ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పాటిల్, ఏక్ నాథ్ షిండే, జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతును బీజేపీకి భాగస్వామ్య పక్షాలు ఇవ్వనున్నాయి.వారి భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.


కాగా.. ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు(బుధవారం) ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. ఏపీలో కూటమి భారీ విజయం తర్వాత మొదటిసారిగా చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబుకు టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామ కృష్ణంరాజు, కంభంపాటి రామ్మోహన్ , నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈనెల 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jun 05 , 2024 | 04:27 PM