AP Govt: తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలకు అధికార యంత్రాంగం సిద్ధం
ABN , Publish Date - Jul 05 , 2024 | 06:35 PM
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేపు (శనివారం) ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేపు (శనివారం) ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రగతి భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావటం ఇదే తొలిసారి.
ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది.
అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వ వాదనకు సంబంధించి నోట్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గత కమిటీలో ఉన్న కుటుంబరావు, ప్రేమ చంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యంతో అధికారులు మాట్లాడారు. కుటుంబరావు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
చీఫ్ సెక్రటరీతో పాటు, సీఎంఓ అధికారులను కూడా హైదరాబాద్ రావాల్సిందిగా సీఎం ఆదేశించారు. షెడ్యూల్ 9 , 10 సంస్థల విభజనతో పాటు, విద్యుత్ బకాయిలు, ఇతర సమస్యలపై కూడా చర్చలు జరపునున్నారు. గతంలో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఎక్కడ ఏర్పడింది... ఇప్పుడు పరిష్కరించాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ బకాయిలపై కోర్టుల్లో వ్యాజ్యాలు, ఆస్తుల పంపిణీ పై కోర్టుల్లో ఉన్న పిటీషన్ల వివరాలను కూడా సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రేపు ఏపీ, తెలంగాణ సీఎంల మీటింగ్ ఎజెండా, ఇతర ముఖ్యమైన వివరాలు
1.షెడ్యల్ 9లోని ఆస్తుల విభజన
2.షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన
3.చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన
4.ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇష్యూ
5.విద్యుత్ బకాయిలు
6. పదిహేను ఎక్సట్రనల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పల పంపిణీ
7.ఉద్యోగుల మార్పిడి
8.లేబర్ సెస్ పంపిణీ
9.ఉమ్మడి సంస్థలకు ఖర్చు చేసిన సొమ్మును తిరిగి చెల్లించడం
10.హైదరాబాద్‌లోని మూడు భవనాలను నిలుపుదల చేయడం
షెడ్యూల్ 9 సంస్ధలు...
మొత్తం 91 సంస్ధల్లో 89 సంస్ధల కేంద్ర సముదాయాలు పంపిణీకి షీలా భేడీ కమిటీ సిఫారస్సులు
అన్ని ఈసీ సిఫారస్సులను 89 సంస్ధల విషయంలో ఓకే చెప్పిన ఏపీ
ఈసీ సిఫారస్సుల్లో 68 సంస్థల విషయంలోనే అంగీకారం తెలిపిన తెలంగాణ
ఏపీ తరపున రేపు సమావేశంలో పాల్గొనే వారు సీఎం చంద్రబాబుతోపాటు సీఎస్, ముగ్గురు మంత్రులు, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు
ఏపీ తరపున రేపటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్య ప్రసాద్ , రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్ధన రెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గెష్ హాజరవనున్నారు.