Share News

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?

ABN , Publish Date - May 31 , 2024 | 05:40 PM

ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?
Purandeswari

విజయవాడ: ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు. ఆదాయం లేని కార్పొరేషన్‌ల ద్వారా అప్పులు తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేదు.. పెన్షన్లు ఇవ్వలేదని చెప్పారు. టెండర్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Governor Abdul Nazir) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పురంధేశ్వరితో పాటూ కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం ఉన్నారు.

భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని పూచీకత్తుగా చూపించి అప్పులు తెచ్చారని మండిపడ్డారు. గవర్నర్ ద్వారా ఆర్థిక అంశాలపై సీఎస్ నుంచి వివరణ తెప్పించాలని గవర్నర్‌ను కోరామని అన్నారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా చేసిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు వివరాలు కోరామన్నారు. తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సావరీన్ గ్యారెంటీగా తెచ్చిన అప్పులు వివరాలు అడిగామని చెప్పారు.

కేర్ టేకర్ ప్రభుత్వంగా వనరులు సీఎఫ్ఎంఎస్ ద్వారా విడుదల చేయడం సమంజసం కాదన్నారు. వడ్డీ, అసలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెలా చెల్లించాల్సిన వివరాలు అడిగామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సీఎస్ నుంచి తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని పురంధేశ్వరి పేర్కొన్నారు.

పురంధేశ్వరి లేఖలోని అంశాలు

1. మొత్తం అవుట్ స్టాండింగ్ RBI లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు.

2. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల మొత్తం (కార్పొరేషన్ల వారీగా)

3. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం.

4. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం

5. రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం

6. ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల వివరాలు

7. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి మరియు ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు

8. ప్రభుత్వ ఉద్యోగులకు TA, DA బకాయిలు ఎంత ఉన్నవి

9. ప్రతి సంవత్సరం రీపేమెంట్‌కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టాల్సి ఉన్నది.

10. సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్‌కు, డిస్కంలకు, పవర్ సప్లయర్స్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నవి .

11. నిధులు రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం విడుదల చేసినట్లుగా ప్రకటనలు చేస్తూ... బటన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం . ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించాల్సి ఉన్నది.

12. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నవి .

13. కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచని కేసులు ఎన్ని ఉన్నాయి.

ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ద్వారా తెప్పించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పురంధేశ్వరి కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..

Read Latest AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 06:44 PM