Share News

Nara Brahmini: నిరంతరం మంగళగిరి అభివృద్ధే లోకేష్ ఆలోచన..

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:37 PM

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి శనివారం మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని... మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా బ్రహ్మణి అన్నారు.

Nara Brahmini: నిరంతరం మంగళగిరి అభివృద్ధే లోకేష్ ఆలోచన..

గుంటూరు, ఫిబ్రవరి 17: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి (Nara Brahmini) శనివారం మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని... మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా బ్రహ్మణి అన్నారు.

ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేష్ లక్ష్యమన్నారు. నిరంతరం మంగళగిరి అభివృద్ధి గురించే లోకేష్ ఆలోచన అని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని... మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయని నారా బ్రహ్మణి పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 17 , 2024 | 04:37 PM