Share News

Minister Buggana: ఏపీకి ప్రత్యేక హోదా బదులు.. ప్యాకేజీ తెచ్చింది చంద్రబాబే

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:43 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ( Minister Buggana Rajendranath Reddy ) అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ... ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు లోకేష్ వైసీపీ నేతలకు పేర్లు పెడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మండిపడ్డారు.

Minister Buggana:  ఏపీకి ప్రత్యేక హోదా బదులు.. ప్యాకేజీ తెచ్చింది చంద్రబాబే

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ( Minister Buggana Rajendranath Reddy ) అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ...‘‘ ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు లోకేష్ మాకు పేర్లు పెడతున్నారు.. వారికి మేము పేర్లు పెట్టలేమా...? వేర్వేరు సమయాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తు పెట్టుకుని అవసరం తీరాక వారిని వదిలేసే చంద్రబాబు మాకు హితోక్తులు చెబుతారా..? ఏపీలో వైసీపీతో తప్ప అన్నీ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు మాటలు వింటున్నారు. ఇప్పుడు కానీ గతంలో ఆయన వారి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా. మనస్సులో మాట పుస్తకంలో ఆయన ఆయా వర్గాలకు సబ్సిడీ ,రాయితీలు వద్దనీ రాసుకున్నారు. రాష్ట్ర విభజనకు కారణమే చంద్రబాబు. 2008లో కేంద్రానికి టీడీపీ తరపున లేఖ రాశారు. ఏపీ నుంచి హైదరాబాద్ విడిపోవడం వల్ల 1.80 లక్షల కోట్ల రెవెన్యూ ఏపీకి రాకుండా పోయింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి పేర్కొన్నారు.


చంద్రబాబు విధానాల వల్లే అప్పులు

‘‘ఏపీకి ప్రత్యేక హోదా బదులు.. ప్యాకేజీ తెచ్చింది చంద్రబాబే. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు ఏం సాధించారు. పోలవరం ప్రాజెక్టు నిధులు గురించి కూడా స్పష్టమైన హామీ తేలేక పోయారు. వైసీపీ హయాంలో రామాయపట్నం పోర్టు కడుతున్నాం. కడప స్టీల్ ప్లాంట్‌ని కట్టేందుకు జిందాల్ స్టీల్ సంస్థ ముందుకు వచ్చింది. చంద్రబాబు రాజకీయ విధానాల వల్లే రాష్ట్రానికి అప్పులు అయ్యాయి. ఏపీలో వేల కిలోమీటర్లు రోడ్లు వేశాం. సీపీఎస్ గురించి ఆలోచించి భవిష్యత్‌లోనూ ఇబ్బందులు రాకుండా జీపీఎస్ అమలు చేశాం. ఆర్థిక వ్యవస్థపై టీడీపీ నేతలు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. 13 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటే యనమల రామకృష్ణ 10 లక్షలు అప్పు అంటారు. అసలు అప్పు ఎంతో సరిగ్గా చెప్పగలరా..? టీడీపీ హయాంలో కంటే.. ఏపీకి ఎక్కువ ఆదాయం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పెరిగింది. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ అప్పులు, ఆదాయాల గురించి పార్లమెంటులోనే స్పష్టం చేసింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి అన్నారు.

కోవిడ్ వల్ల రాబడి తగ్గి అప్పులు పెరిగాయి

‘‘ఏపీకి కోవిడ్ వల్ల రాబడి తగ్గింది.. దీంతో ఎక్కువ అప్పులు అయ్యాయి. ఏపీలో పెండింగ్ బిల్లులు 1.70 లక్షల కోట్లు ఉన్నట్టు ఎవరూ చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2.71 లక్షల కోట్లు అప్పు ఉంది. మా ప్రభుత్వ హయాంలో అప్పులు 12 శాతం మేర మాత్రమే పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇంటింటికీ వెళ్లి అప్పు చేయవు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మాత్రమే అప్పులు తీసుకుంటాయి. అది అంతా బహిరంగంగానే వివరాలు ఉంటాయి. మద్యం ఆదాయంలో అదనంగా వచ్చే పన్నును మహిళలు, రైతులు సహా నాలుగు పథకాలకు వినియోగించేలా చట్టం చేశాం. పార్లమెంట్లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రా కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం మీడియాలో ఎందుకు రాయడం లేదు. టీడీపీ నేతలు అప్పులపై నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారు. 2014-19 మధ్య స్థూల ఉత్పత్తి 6.95 లక్షల కోట్లు మాత్రమే. మా హయాంలో అది రూ. 10 లక్షల కోట్లుగా ఉంది. రెవెన్యూ కూడా వైసీపీ హయాంలో 16 శాతం వృద్ధి నమోదు అయ్యింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 11 , 2024 | 04:00 PM