Share News

Atchannaidu: బీసీ డిక్లరేషన్‌పై రేపటి సభలో కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 04 , 2024 | 05:04 PM

బీసీ డిక్లరేషన్‌ను రేపటి సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది రేపటి సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు.

 Atchannaidu:  బీసీ డిక్లరేషన్‌పై రేపటి సభలో కీలక ప్రకటన

అమరావతి: బీసీ డిక్లరేషన్‌ను రేపటి సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది రేపటి సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు.

ఏపీ నలుమూలల నుంచి పార్టీలకతీతంగా బీసీలు ఈ సభకు భారీగా తరలి రాబోతున్నారని అన్నారు. సుమారుగా మూడు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని చెప్పారు. ఈ సభను ఫెయిల్ చేయాలని జగన్ ప్రభుత్వం అన్ని ఆటంకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు అడిగినా ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా కాలినడకనైనా బీసీలు తరలివస్తారని చెప్పారు. ఐదుగురు రెడ్లకు రాష్ట్రాన్ని జగన్ పంచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!

Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 05:05 PM