Share News

AP News: ప్రభుత్వం మారిన తర్వాత.. ఏపీ గవర్నర్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:29 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రెవెన్యూశాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూకేటాయింపులు, అధికారుల బదిలీ ఫైళ్లను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

AP News: ప్రభుత్వం మారిన తర్వాత.. ఏపీ గవర్నర్ కీలక ఆదేశాలు

అమరావతి: ఏపీలో ప్రభుత్వం మారడంతో సచివాలయంలోని కీలక డాక్యూమెంట్లను భద్రపరచాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు , విభాగాధిపతి కార్యాలయాలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకనుగునంగా ఆయా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.


భూముల కేటాయింపు, కాంట్రాక్టర్లకు నిధులు విడుదల, అధికారుల బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించారు. అధికారిక పత్రాలు, ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డులను తక్షణం భద్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని రికార్డులను సైతం భద్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీఏడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు.


రెవెన్యూశాఖ కీలక ఆదేశాలు..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రెవెన్యూశాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూకేటాయింపులు, అధికారుల బదిలీ ఫైళ్లను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని ఆదేశించారు. కీలక ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దని రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!

AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 07:12 PM