Share News

AP News: 2024 ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే.. ఫారూఖ్ షుబ్లీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 24 , 2024 | 04:35 PM

చంద్రబాబు పాలనలో ఎక్కడా ముస్లింల ఆత్మగౌరవానికి భంగం కలగలేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ (Farooq Shubli) అన్నారు. శనివారం నాడు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లింలు, మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ముస్లింలపై జరుగుతున్న దాడులు, మైనార్టీల అభివృద్ధిపై నాయకులు చర్చించారు.

AP News: 2024 ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే..  ఫారూఖ్ షుబ్లీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ: చంద్రబాబు పాలనలో ఎక్కడా ముస్లింల ఆత్మగౌరవానికి భంగం కలగలేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ (Farooq Shubli) అన్నారు. శనివారం నాడు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లింలు, మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ముస్లింలపై జరుగుతున్న దాడులు, మైనార్టీల అభివృద్ధిపై నాయకులు చర్చించారు. 2024 ఎన్నికల్లో టీడీపీకు సహరించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ షిబ్లి మాట్లాడుతూ... సెక్యూలర్‌కు మారు పేరు చంద్రబాబు అని చెప్పారు.

గత 5 ఏళ్లలో టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ముస్లింల అభివృద్ధిని ఎక్కడా విస్మరించలేదని అన్నారు. తాము బీజేపీతో లేమని అంటునే.. ముఖ్యమంత్రి జగన్ అంతర్గతంగా ఆ పార్టీకు మోకరిల్లుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ముస్లింలపై 107 దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న దాడులను తాము ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు చంద్రబాబు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. తమ హక్కుల సాధన, అభివృద్ధి కోసమే టీడీపీకు మద్దతు ఇస్తున్నామని ఫారూఖ్ షుబ్లీ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 24 , 2024 | 05:49 PM