Share News

YCP: ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ.. ఆ నేతల్లో ఆందోళన

ABN , Publish Date - Feb 19 , 2024 | 06:18 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల కోసం అధికార వైసీపీ (YSRCP) పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్లాన్‌లో భాగంగా తాడేపల్లి ఆఫీసులో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) తో ఐ ప్యాక్ బృందం భేటీ అయింది. ఈ బృందానికి జగన్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలోప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్ధానాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.

 YCP: ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ.. ఆ నేతల్లో ఆందోళన

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల కోసం అధికార వైసీపీ (YSRCP) పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్లాన్‌లో భాగంగా తాడేపల్లి ఆఫీసులో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) తో ఐప్యాక్ బృందం భేటీ అయింది. ఈ బృందానికి జగన్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలోప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్ధానాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. వైసీపీకు ఏయే జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఏయే జిల్లాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోడానికి మ్యానిఫెస్టోలో ఏయే కార్యక్రమాలు చేర్చాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికే మ్యానిఫెస్టోపై పార్టీ సీనియర్లతో జగన్ కసరత్తు చేశారు. తాజాగా ఐప్యాక్ బృందం సూచనతో మ్యానిఫెస్టోలోనూ స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐప్యాక్ బృందంతో సీఎం చర్చిస్తుండడంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదోనని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు పరేషాన్ అవుతున్నారు. ఐప్యాక్ సర్వే పేరు చెప్పి తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోననే ఆందోళన నేతల్లో మొదలైంది. వైసీపీలో ఉంటూ విపక్షాలపై నోరు పారేసుకున్న నేతల్లో కూడా గుబులు పుడుతోంది. తాము పోటీ చేసే సీట్లు అటు ఇటు అయితే పరిస్థితి ఏంటనే దానిపై నేతలు టెన్షన్ పడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో సీట్లపై చర్చ నడుస్తోండటంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

AP NEWS: కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా.. సీఎం జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం

Pawan Kalyan: పార్టీ‌లో వారికి సముచిత స్థానం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 07:16 PM