Share News

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:58 PM

అంగన్‌వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ( AP Govt ) పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. శుక్రవారంతో అంగన్‌వాడీల సమ్మె ( Anganwadi Strike ) 32వ రోజుకి చేరుకుంది. అయితే పలుమార్లు చర్చలకు అంగన్‌వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది.

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

అమరావతి: అంగన్‌వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ( AP Govt ) పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా వారు సమ్మె చేస్తున్నారు. శుక్రవారంతో అంగన్‌వాడీల సమ్మె ( Anganwadi Strike ) 32వ రోజుకి చేరుకుంది. అయితే పలుమార్లు చర్చలకు అంగన్‌వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది. అయితే ప్రభుత్వం వారి డిమాండ్లపై సరైన హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలం అవుతునే ఉన్నాయి. అంగన్‌వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నాడు మరోమారు ప్రభుత్వం సచివాలయంలో చర్చలకు పిలిచింది. కానీ ఈరోజు కూడా చర్చలు సఫలం కాలేదు.

ప్రభుత్వం తరపున చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ చర్చించారు. వేతనాలు పెంపు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అంగన్‌వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ ( YCP ) అనుకూల సంఘం‌ చర్చలకు రావడం‌పై‌ ఇతర సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. అయితే అధికారులు సర్ది చెప్పడంతో అధికారులు మళ్లీ చర్చలు ప్రారంభించారు. అయితే అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు‌ విఫలం అయినట్లు తెలుస్తోంది. సమ్మె కొనసాగించాలని అంగన్‌వాడీ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అంగన్‌వాడీ సంఘాల నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ సంఘాల నేతలను హెచ్చరించారు.

Updated Date - Jan 12 , 2024 | 08:58 PM