Share News

AP Politics: కొంగుచాచి అడుగుతున్న ఆశీర్వదించండి.. పులివెందుల సభలో షర్మిల

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:19 PM

కొంగు చాచి అడుగుతున్న.. మీ ఆడ బిడ్డలం, న్యాయం చేయండి.. మీరే న్యాయ నిర్ణేతలు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావొద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆడ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నం అని కంట నీరు తెచ్చుకున్నారు. ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు ధర్మం ఉంది.. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు.

AP Politics: కొంగుచాచి అడుగుతున్న ఆశీర్వదించండి.. పులివెందుల సభలో షర్మిల
YS Sharmila Emotional On Campaign

కడప జిల్లా: కొంగు చాచి అడుగుతున్న.. మీ ఆడ బిడ్డలం, న్యాయం చేయండి.. మీరే న్యాయ నిర్ణేతలు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడు అని వైఎస్ షర్మిల (YS Sharmila) పులివెందుల బహిరంగ సభలో భావొద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆడ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నం అని కంట నీరు తెచ్చుకున్నారు. ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు ధర్మం ఉంది.. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు. సోదరుడు, ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పులివెందుల పులి కాదు పిల్లి, బీజేపీకి బానిసలా మారిన పిల్లి అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

AP Politics: సకాలంలో పెన్షన్ అందించేలా చర్యలు తీసుకొండి: ఎలక్షన్ అబ్జర్వర్‌కు రిక్వెస్ట్


‘పులివెందులకు మేం వస్తున్నామని తెలిసి లైట్లు తీశారు. లైట్లు ఉండవంటే సీఎంగా జగన్ ఫెయిల్ అయినట్టు. లైట్లు కావాలని తీశారంటే అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్టు. వివేకా హత్య విషయంలో సునీత చాలా బాధపడింది. న్యాయం జరగడం లేదని ఆవేదన చెందింది. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అన్న కోసం ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న సీఎం అయితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకున్న. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు అని’ షర్మిల గుర్తుచేశారు.


‘జగన్ పులివెందుల పులి కాదు..పిల్లి. పిల్లిలా మారి బీజేపీకి జగన్ బానిస అయ్యాడు. అధికారం ఇస్తే వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తానని చెప్పాడు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తా అన్నాడు. 42 పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే పట్టుమని 10 పూర్తి చేయలేక పోయాడు. పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధాని కూడా కట్టలేక పోయాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగున్నర ఏళ్లుగా కోటలో నిద్ర పోయాడు. కుంభకర్ణుడు లెక్క నిద్ర లేచి డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నాడు. 5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. మద్య నిషేదం అని చెప్పి మోసం చేశారు. నిషేదం పేరు చెప్పి కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారు. కొంగు చాచి అడుగుతున్న. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ..ఒకవైపు హంతకుడు. ఒక వైపు న్యాయం ఉంది. మరోవైపు ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి అని’ షర్మిల సూచించారు.

pithapuram: రైతులే టార్గెట్: వర్మ సంచలన వ్యాఖ్యలు


‘మార్చ్ 15వ తేదీన ఉదయం ఫోన్ వచ్చింది. నాన్న చనిపోయారు అని సమాధానం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆపమని నేను చెప్పాను. ఏరియా ఆసుపత్రిలో తల నుంచి ఎముకలు, మెదడు బయటకు వచ్చాయి. ఏమయ్యిందో అర్థం కాలేదు. పోలీసులు వస్తున్నారు..పోతున్నారు. అసలు ఏం జరిగిందో తేల్చుకోలేక పోయాం. చనిపోయిన ఇంట్లో నన్ను ఉండకూడదు అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఎవరు చేశారో తెలియలేదు. ఇంతలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జగన్‌ను కలిశా. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ఉండి దోషులకు శిక్ష వేయక పోతే అవమానం అన్నారు. దాంతో జగన్ అన్నను బాగా నమ్మాను. కానీ తనను మోసం చేశారు. హత్య చేసిన వారికి శిక్ష పడాలి. షర్మిలను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్‌కి వెళ్తుంది. మనం షర్మిలను గెలిపించాలి. న్యాయం వైపు నేను, షర్మిల ఉన్నాం. ధర్మం వైపు నిలబడ్డాం అని’ సునీత కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 09:19 PM