Share News

YS Sharmila: గుజరాత్‌లో మంగళసూత్రాలు తెంచలేదా.? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 07:00 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందట..? ఇలా మాట్లాడటం సరికాదు. మతాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు.

YS Sharmila: గుజరాత్‌లో మంగళసూత్రాలు తెంచలేదా.? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు
YS Sharmila

బాపట్ల జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మండపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందట..? మతాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడటం సరికాదని షర్మిల సూచించారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు..? ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనలో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు అని మండిపడ్డారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమ నింపేలా వ్యవహరిస్తున్నారని షర్మిల గుర్తుచేశారు. ప్రధాని మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని సవాల్ విసిరారు. ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదని షర్మిల హితవు పలికారు.


‘ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. ఇలాంటి దొంగ (బాపట్ల) ఎమ్మెల్యేకి మళ్లి టికెట్ ఇచ్చాడట కదా.. దోచుకొని తినమని చెప్పడానికి జగన్ సీట్ ఇచ్చాడా..? గత పదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. బాపట్లలో నల్లమాడ వాగు ప్రతి ఏటా ఉప్పొంగుతుంది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగుతుంది.ఆధునీకరణ చేయాలని వైఎస్ఆర్ అనుకున్నారు. ఈ కాలువను వైఎస్ఆర్ వారసుడిగా జగన్ పట్టించు కోలేదు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టాలంటే రైతును రాజు చేయాలి. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు కట్టించాలి. ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వైఎస్ఆర్ వారసులు అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


Read Latest Election News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 07:08 PM