Share News

AP Election 2024: వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలి: వర్లరామయ్య

ABN , Publish Date - May 06 , 2024 | 10:09 PM

పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.

AP Election 2024: వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలి: వర్లరామయ్య
Varla Ramaiah

అమరావతి: పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలు నిర్వహిస్తుండటంపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.

కాబట్టి వారికి ఓటు వేసే అవకాశం కల్పించేలా పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అమరావతిలోని విట్‌లో పరీక్షలు 12, 14న పరీక్షలు పెట్టారని తెలిపారు. 13న ఓటు వేయడానికి వెళ్లిన వారు 14న ఎలా పరీక్ష కోసం రాగలుగుతారని ఈసీని అడిగామని అన్నారు.


Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్‌కు బదులు ఈవీఎంను వాడారని.. ఆ ఓట్లు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. రెండున్నరేళ్లు ఇన్‌చార్జి డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి ఉండి ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని.. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని కొత్త డీజీపీని కోరారు. సీఎం జగన్ తగవులు తీర్చాలి, తగవులు పెట్టకూడదని సూచించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అశాంతి సృష్టించకూడదని వర్ల రామయ్య అన్నారు.


Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

వారి షాపులు తగలబెట్టారు: మన్నవ సుబ్బారావు

గుంటూరులో వైసీపీ నేత ముస్తఫా ప్రచార కార్యక్రమంలో పాల్గొనని వారి షాపులను తగలబెట్టారని టీడీపీ నేత మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) అన్నారు. అలా తగలబెట్టిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మాచర్లలో వైసీపీ గూండాలు యథేచ్ఛగా దాడులు చేస్తున్నా చర్యలు లేవని అన్నారు. గుంటూరులో ఒక హెడ్ కానిస్టెబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లపై వైసీపీ నేతలు దాడులు చేశారని మండిపడ్డారు. వారికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. తక్షణమే వారి అందరిపైనా చర్యలు తీసుకోవాలని మన్నవ సుబ్బారావు కోరారు.


వారు ఫోన్ చేస్తున్నారు: మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి

గత నెలలో పెన్షన్ల పంపిణీని అభాసుపాలు చేశారని టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Marreddy Srinivasulu Reddy) అన్నారు. చివరకు గత నెలలో 33మంది చనిపోవడానికి సీఎస్ జవహార్‌రెడ్డి కారణం అయ్యారని మండిపడ్డారు. వార్డు, గ్రామ సచివాలయాల నుంచి ఎన్నికల అధికారులమని ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్నారని అన్నారు.

మీరు ఊళ్లో ఉంటున్నారా, ఓటు వేయడానికి వస్తున్నారా అని అడుగుతున్నారని చెప్పారు.1000 మందిని మహరాష్ట్రకు ఎన్నికల విధులకు పంపారని చెప్పారు. వారిని ఇప్పటి వరకూ రిలీవ్ చేయలేదని.. ఆ1000 ఓట్లుకు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలని ఈసీని కోరారు. ఈ విషయంపై సీఈవో మీనా తగు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారని మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

Updated Date - May 06 , 2024 | 10:54 PM