Share News

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:08 PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?
Chandrababu Nomination

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ముందుగా నామినేషన్ పత్రాలకు కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్ నుంచి వరదరాజస్వామి దేవాలయానికి బయల్దేరి వెళ్లారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి కుప్పం టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ అనంతరం కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. భోజన విరామం అనంతరం కుప్పం పార్టీ కార్యాలయం వద్ద అంతర్గత సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఆమె క్రేజ్ చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు లైవ్‌లో చూసేయండి..

Updated Date - Apr 19 , 2024 | 01:13 PM