Share News

TDP MP Candidates: నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:47 PM

TDP MP Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది..

TDP MP Candidates: నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఒక్క ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్ప.. మిగిలిన ముగ్గురు కొత్త వ్యక్తులేనని తెలుస్తోంది. అయితే.. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తన మార్క్ చూపించారని.. టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో కచ్చితంగా మూడు టీడీపీవేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

TDP-JanaSena-Social-Media-L.gif

TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?

ఎంపీ అభ్యర్థులు వీరే..

విజయనగరం : కలిశెట్టి అప్పలనాయుడు

ఒంగోలు : మాగుంట శ్రీనివాసులురెడ్డి

అనంతపురం : అంబికా లక్ష్మీనారాయణ

కడప : భూపేష్‌రెడ్డి

TDP-Public.jpg

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

చీపురుపల్లి : కళా వెంకట్రావు

భీమిలి: గంటా శ్రీనివాసరావు

పాడేరు: కె. వెంకటరమేశ్‌ నాయుడు

దర్శి : గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట : సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు : వీరభద్ర గౌడ్‌

గుంతకల్లు : గుమ్మనూరు జయరామ్

అనంతపురం అర్బన్‌ : దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

కదిరి : కందికుంట వెంకట ప్రసాద్‌‌‌లను అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి



Updated Date - Mar 29 , 2024 | 02:47 PM