Share News

Raghurama: డీజీపీపై కూడా వేటు వేయాలి.. రఘురామ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:15 PM

సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని ఎంపీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉండి అసెంబ్లీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో దైవం దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నిన్ననే నామినేషన్ వేసి..ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని విరుచుకుపడ్డారు.

Raghurama: డీజీపీపై కూడా వేటు వేయాలి.. రఘురామ కీలక వ్యాఖ్యలు

తిరుపతి: సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని ఎంపీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉండి అసెంబ్లీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో దైవం దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నిన్ననే నామినేషన్ వేసి..ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని విరుచుకుపడ్డారు.

కొత్తగా తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రజల ఆస్థిని కాపాడాల్సిన వారే ప్రజా భక్షకులుగా మారారని మండిపడ్డారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి..తనను చంపేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీవారి దయతో భయటపడ్డానని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమే తన లక్ష్యమని.. అతని ఓడించే వరకు తన పోరాడుతానని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా..ఇంచార్జ్ డీజీపీ కొనసాగే అవకాశం లేదన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కూడా వేటు పడుతుందని ఆశిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.


Pawan Kalyan: నామినేషన్ అనంతరం జనసేనాని కీలక వ్యాఖ్యలు

చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబులానే భారీ మెజార్టీతో నానిని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు. జగన్‌పై గులక రాయి దాడిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. బాలుడు విసిరిన రాయి దాడిలో సీఎంతో పాటు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లికి గాయ్యాలయ్యాయని చెప్పారు. బాలుడు దాడి చేసిన రాయి ఎలా మాయమైందని ప్రశ్నించారు.


AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి


వైసీపీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోనున్నదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ గులక రాయి డ్రామా జరిగిందని ఆరోపించారు. గోదావరి జిల్లాలో సీఎం జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా.. ప్రజాదరణ కరువైందని విమర్శించారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ,అనకాపల్లి జిల్లాలో సీఎం బస్సు పర్యటన అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమేనని జోస్యం చెప్పారు. కూటమి ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.


AP Election 2024: ఈ సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 10:52 PM