Share News

Prajagalam Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం..

ABN , First Publish Date - May 06 , 2024 | 03:39 PM

PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు..

Prajagalam  Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం..
PM Narendra Modi

Live News & Update

  • 2024-05-06T16:40:23+05:30

    మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్‌ విశ్వాసం ఏపీకి అవసరం

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు.

  • 2024-05-06T16:33:38+05:30

    వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప..రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు: మోదీ

    • వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప..రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు

    • రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది

    • రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించింది

    • కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది

  • 2024-05-06T16:30:32+05:30

    మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపీ: మోదీ

    • ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది

    • అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారు

    • వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్‌ స్పీడ్‌తో పరిగెత్తింది

    • మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు

    • మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపీ

    • అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు

  • 2024-05-06T16:21:00+05:30

    కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోదీ

    • పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అథోగతిపాలు చేసింది

    • ఈడీ..ఈడీ..అంటూ ఇండి కూటమి గగ్గోలు పెడుతోంది

    • కాంగ్రెస్‌ నేతల దగ్గర గుట్టలకొద్దీ డబ్బు బయటపడుతోంది

    • కాంగ్రెస్‌ నేతల డబ్బును మిషన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి

  • 2024-05-06T16:11:55+05:30

    వైసీపీ సర్కార్‌పై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..

    వైసీపీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందన్నారు. అందుకే వైసీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు ప్రధాని.

  • 2024-05-06T16:07:23+05:30

    తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...

    • ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.

    • ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు.

    • వికసిత ఆంధ్ర, వికసిత భారత్ తమ లక్ష్యం అని పేర్కొన్నారు.

  • 2024-05-06T16:05:18+05:30

    తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ

    • నా ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు

    • ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నాం

    • దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది

    • లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం

    • మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం కాబోతుంది

  • 2024-05-06T16:00:03+05:30

    కేంద్ర పథకాలకు జగన్‌, వైఎస్‌ పేర్లు పెట్టుకున్నారు: పవన్‌

    • కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు

    • జగన్‌ పాలనలో అడుగడుగునా కుంభకోణాలే

    • మోదీ వికసిత్‌ భారత్‌ కలలో మేమూ భాగస్వాములం అవుతాం

    • గతంలో పద్మ అవార్డులు రాజకీయాలు చేసేవారికే వచ్చేవి

    • మోదీ హయాంలో అసలైన అర్హులకు పద్మ అవార్డులు దక్కుతున్నాయి

  • 2024-05-06T15:58:59+05:30

    భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ: పవన్‌

    • అయోధ్యకు రామచంద్రుడిని తీసుకువచ్చిన మహానుభావుడు మోదీ

    • భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ

    • దేశానికి అభివృద్ధితోపాటు గుండె ధైర్యం అవసరం

    • శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునే గుండె ధైర్యం కావాలి

    • పదేళ్లుగా భారత్‌ వైపు చూడాలంటేనే భయపడుతున్న శత్రువులు

    • మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోంది

    • కేంద్ర పథకాలను తన పథకాలుగా వైసీపీ చెప్పుకుంటోం

    • కేంద్ర పథకాలను జగన్‌ అందిపుచ్చుకోలేకపోయాడు

  • 2024-05-06T15:52:07+05:30

    మోదీ స్ఫూర్తి, బాబు యుక్తి, పవన్‌ శక్తి కలయిక అపూర్వం: పురందేశ్వరి

    • సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌..అనేది బీజేపీ విధానం

    • సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు..అనేది టీడీపీ విధానం

    • బాధితుల పక్షాన నిలబడటం జనసేన విధానం

    • జగన్‌ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు

  • 2024-05-06T15:52:01+05:30

    నరేంద్ర మోదీ విశ్వజీత్‌: నారా లోకేష్‌

    • విశ్వజీత్‌ అంటే విశ్వాన్ని జయించినవారని అర్థం

    • ప్రపంచంలో అగ్రగామిగా భారత్‌ను నిలుపుతున్న మోదీ

    • దేశం దశ..దిశ.. మార్చింది నమో నమో అనే 4 అక్షరాలు

    • తెలుగు పౌరుషాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్‌

    • భారత్‌ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మోదీ

    • టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాం

    • టీడీపీ హయాంలో విశాఖను ఐటీ హబ్‌గా చేశాం

    • యువతకు ఉపాధి ఎలా అందించాలో బాబుకు తెలుసు

    • జగన్‌ పాలనలో తొలి బాధితులు యువతే

  • 2024-05-06T15:47:21+05:30

    ప్రజాగళం సభలో ఆసక్తికర సన్నివేశం..

    రాజమహేంద్రవరంలో జరుగుతున్న ప్రజాగళం సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభా వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు. అయితే, కాళ్లు మొక్కొద్దంటూ పవన్ కల్యాన్‌ను ప్రధాని మోదీ వారించారు.

  • 2024-05-06T15:44:21+05:30

    ప్రజాగళం సభలో బాబుకు బదులుగా లోకేష్..

    ప్రజాగళం సభకు చంద్రబాబు హాజరవలేదు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ సభకు హాజరయ్యారు. లోకేష్‌ను భుజం తట్టి ప్రధాని మోదీ అభినందించారు.

  • 2024-05-06T15:35:41+05:30

    PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర ఇవాళ ఏపీలో ప్రచారం నిర్వహించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో చేపట్టిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం పాయింట్స్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..