Share News

AP Politics: డీజీపీకి టైమ్ దగ్గర పడింది.. అధికారుల తీరుపై లోకేష్ ఆగ్రహం..

ABN , Publish Date - Mar 24 , 2024 | 08:52 PM

ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో..

AP Politics: డీజీపీకి టైమ్ దగ్గర పడింది.. అధికారుల తీరుపై లోకేష్ ఆగ్రహం..
Nara Lokesh

అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్‌కి ఏం పని అని లోకేష్ ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని అన్నారు.

గుంటూరు జిల్లా ఎస్పీపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఎస్పీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సకల శాఖల సజ్జల, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీల వాహనాలు పోలీసులకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారుర. మంగళగిరి మొత్తం డ్రగ్స్ డెన్‌గా మారిందని ఆరోపించారు. పోలీసులకు ఇదేమీ కనిపించదా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసుల సహకారం లేకుండా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు ఎలా దొరుకుతాయి? అని లోకేష్ ప్రశ్నించారు.

అతనే డ్రగ్స్ కింగ్..

ఎమ్మెల్సీ అనంత బాబే డ్రగ్స్ కింగ్ అని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రం అంతటా గంజాయి పంట పండించటం నుంచి సరఫరా వరకూ అనంతబాబు నేతృత్వం వహిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని లోకేష్ ఆరోపించారు. ఎవరితో ఫోన్ మాట్లాడినా బీప్ శబ్ధం వస్తోందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 09:04 PM