Share News

AP Elections 2024:జగన్‌ను వదిలిపెట్టం.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 03 , 2024 | 09:26 PM

సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) చేసిన తప్పులకు వదిలిపెట్టమని...చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు.

AP Elections 2024:జగన్‌ను వదిలిపెట్టం.. నారా లోకేష్ మాస్ వార్నింగ్
Nara Lokesh

నంద్యాల: సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) చేసిన తప్పులకు వదిలిపెట్టమని...చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు. మేలుకో ఆంధ్రుడా... ఎన్నాళ్లీ కుల, మతాలపేరుతో కుంపట్లు అని ప్రశ్నించారు.


Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం

ముస్లింలు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని... గుండెల్లో పెట్టుకుంటామని మాటిచ్చారు. 2014-19 మధ్య రూ.1500కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేశామని వివరించారు. తమ హయాంలో 10వేల టిడ్కో ఇళ్లు కట్టించామని.. అయినా 2019 ఎన్నికల్లో సండే ఎమ్మెల్యేని గెలిపించారని విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఫైర్ అయ్యారు.


Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

వారిపై చర్యలు..

ఎంపీ బ్రహ్మానందరెడ్డి కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కల్తీవిత్తనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతతకు మారుపేరైన నంద్యాలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 15 హత్యలు జరిగాయని మండిపడ్డారు. కానిస్టేబుల్ సురేంద్రను తరిమి తరిమి చంపారని హెచ్చరించారు. మళ్లీ నంద్యాలను ప్రశాంత నిలయంగా మారాలంటే కూటమి అభ్యర్థులు ఫరూక్, శబరిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నారా లోకేష్ పేర్కొన్నారు.

AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 09:31 PM