Share News

AP Election 2024: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. ప్రధాని మోదీ మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 08 , 2024 | 07:02 PM

ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు.

 AP Election 2024: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. ప్రధాని మోదీ మాస్ వార్నింగ్
PM Narendra Modi

తిరుపతి: ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాగబాబు, కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.


Rahul Gandhi: ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

ఐదేళ్ల వైసీపీ పాలనలో గుండా, రౌడీ రాజ్యం పాలన సాగిందని విమర్శించారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ డ్యాం కొట్టుకుపోయిందని అన్నారు. వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. వీరికి రాబోయే రోజుల్లో పక్కా ట్రీట్మెంట్ ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ సురక్షిత నీరు ఇవ్వాలని తాము అనుకుంటే.. రాష్ట్రంలో అమలు చేయకుండా వైసీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. బలమైన పాలన రాష్ట్రాల్లో ఉంటే దేశానికి బలమని అన్నారు. బీజేపీ పాలనలో గల్ఫ్‌లో భారతీయులకు గౌరవం పెరిగిందని అన్నారు. కతర్ నుంచి సురక్షితంగా మన దేశీయులను తీసుకొచ్చామన్నారు. అదే కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాలేదని చెప్పారు. దేశం అభ్యున్నతి కోసం తాను పని చేస్తుంటే, కాంగ్రెస్ దేశాన్ని వెనక్కు తీసుకుపోతానని చెబుతోందని ధ్వజమెత్తారు.


ఆర్టికల్ 370ను దేశంలో తిరిగి తెస్తుందట, కామన్ సివిల్ కోడ్ ను కూడా అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తమ పాలనలో రామ మందిర నిర్మాణం పూర్తి అయితే, కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తానని చెబుతోందన్నారు. దేశ విభజనను చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దేశ గౌరవం తగ్గేలా ఇతర దేశాల్లో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. దక్షిణాదిలో బులెట్ రైళ్లు తెస్తామని... ఏపీలో కూడా ఈ రైలు పరుగులు తీస్తుందని అన్నారు. రాయలసీమ రైతుల జీవితాల్లో ఎన్డీఏ పాలనలో మాత్రమే వెలుగులు వస్తాయని చెప్పుకొచ్చారు. టమాటా రైతులకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత క్షేమం కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

AP News: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 08 , 2024 | 07:15 PM