Share News

AP Elections: హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా?... బొత్స ఎద్దేవా

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:17 PM

Andhrapradesh: సీఎం జగన్ ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జగన్ అమల చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని తెలిపారు. విద్యలో కూడా కేరళను అధిగమించామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెప్పిందే చేశారని... చేయలేనివి చెప్పరని అన్నారు.

AP Elections: హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా?... బొత్స ఎద్దేవా
Minister Botsa Satyanarayana

విజయనగరం, ఏప్రిల్ 11: సీఎం జగన్ (CM Jaganmohan Reddy) ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జగన్ అమల చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని తెలిపారు. విద్యలో కూడా కేరళను అధిగమించామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెప్పిందే చేశారని... చేయలేనివి చెప్పరని అన్నారు. ఆర్ధిక కారణాల వలన సీపీఎస్ చేయలేకపోయామని... సీపీఎస్ కన్నా మెరుగైన పధకం పెట్టామని వెల్లడించారు. 14 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చెప్పింది చేశామని చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ నాయకత్వం చేస్తున్నది నాయకులతో కాదని... ప్రజలతో అని మంత్రి అన్నారు.

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..


మానసికంగా ఆందోళనకు గురిచేసేందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అవి పట్టించుకునే పరిస్థితిలో లేమన్నారు. 30 మంది ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (Central Election Commission) పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) ఫిర్యాదు చేశారని.. వారిని సీఎం జగన్ నియమించారా అని ప్రశ్నించారు. గతంలో వారు చంద్రబాబు (TDP Chief Chandrababu), కిరణ్ కుమార్ రెడ్డి (Kiram Kumar Reddy), రోశయ్య (Rosaiah) ప్రభుత్వ హయాంలో పనిచేయలేదా అని అడిగారు. వారందరిపై చర్యలు తీసుకుంటే.... ఎన్నికలు నిర్వహించేది ఎవరు..? వారిని కాదని హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి..

BRS: ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నారు.. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రేవంత్?

LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 03:21 PM