Share News

AP Election: పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపుపై ఏపీ సీఈవో ఏమన్నారంటే?

ABN , Publish Date - May 07 , 2024 | 02:56 PM

Andhrapradesh: ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదని.. కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొత్తంగా3 లక్షల 3 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు ప్రకటించారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు.

AP Election: పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపుపై ఏపీ సీఈవో ఏమన్నారంటే?
AP CEO Mukesh kumar Meena

అమరావతి, మే 7: ప్రభుత్వం (AP Government) ఇచ్చే పథకాలను ఆపమని ఎన్నికల సంఘం (Election Commission) చెప్పలేదని.. కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ఏపీ సీఈవో ఎంకే మీనా (AP CEO MK Meena) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 3 లక్షల 3 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు ప్రకటించారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వారు.. ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చని చెప్పారు.

KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!


సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల తొమ్మిదో తేదీన కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే సొంత సెగ్మెంట్లలోని ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఓటు వినియోగించుకోవచ్చన్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టమని తేల్చిచెప్పేశారు. ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చామన్నారు. కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్నారు. కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చామన్నారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!


కొందరు యూపీఐ ద్వారా వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారని.. దీనిపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్నారు. లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులలో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఒక రోజు గడువును పెంచి వెసులుబాట్లు కల్పిస్తున్నామని తెలిపారు. పల్నాడులో హోలో గ్రామ్ ఉన్న కార్డ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్నారు. పల్నాడు ఎపిసోడ్‌పై విచారణ చేపడుతున్నామని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. బెయిలిస్తే అలా చేయొద్దని సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 03:31 PM