Share News

AP News: చరిత్రలోనే తొలిసారి.. డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు

ABN , Publish Date - May 17 , 2024 | 08:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్‌(YS Jagan) సర్కార్‌ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..

AP News: చరిత్రలోనే తొలిసారి.. డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు
AP Police

అమరావతి, మే 17: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్‌(YS Jagan) సర్కార్‌ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా.. డీజీపీతో మొదలుకుని ఎస్‌ఐల దాకా బలి కావాల్సి వచ్చింది. ఇంత మందిపై చర్యలు తీసుకోవడం, పోలింగ్‌ తర్వాతా ఈసీ కొరడా ఝళిపించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి.


పోలింగ్‌కు ముందే డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డితోపాటు ఇంటెలిజెన్స్‌ అధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా తాతా, గుంటూరు ఐజీ పాలరాజు, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిపై వేటు ఈసీ వేసింది. జిల్లా కలెక్టర్లపైనా ఈసీ చర్యలు తీసుకుంది. పోలింగ్‌ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందిస్తూ... ఎస్‌ఐ స్థాయి అధికారులనూ సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది.


ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలలో 12 మంది సబార్డినేట్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌కు గురైన అధికారులు వీరే..

👉 తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి.

👉 ఎస్బిసిఐ రాజశేఖర్

👉 ఎస్వీడీఎస్పీ భాస్కర్ రెడ్డి

👉 అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి

👉 నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ

👉 గురజాల డిఎస్పి పల్లపురాజు

👉 ఎస్బిసిఐ ప్రభాకర్ రావు

👉 మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి

👉 కారంపూడి ఎస్సై రామాంజనేయులు

👉 నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి

👉 తాడిపత్రి డిఎస్పి గంగయ్య

👉 తాడిపత్రి సీఐ మురళీకృష్ణ

వీరిపై వేటు వేస్తూ శాఖా పరమైన విచారణకు ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రత్యేక సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాదు.. వారిపై తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 08:20 AM