Share News

TDP: నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:38 PM

Andhrapradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

TDP: నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

పశ్చిమగోదావరి, మార్చి 15: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ (TDP) తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎస్సీ, మహిళా కోటాలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఒక స్థానం కేటాయిస్తారని ఆశించా. నా ఆశ నిరాశే అయ్యింది . 2015 నుంచి నన్ను అణిచివేయడానికి ఎందరో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పార్టీకి నమ్మకస్తురాలిగానే ఉన్నాను.. చంద్రబాబుకి భక్తురాలిని. టికెట్ ఇస్తే ఓడిపోతాను అని వారు అనుకుంటే... నాకు టికెట్ ఇచ్చిన రెండుసార్లు గెలిచాను. ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాలవారు శాశ్వతం కాదు. నాకు టికెట్ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ పీతల సుజాత వీడియోలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..

Narzo 70 Pro: దేశంలో ఫస్ట్ సోనీ కెమెరాతో వస్తున్న నార్జో.. ధర, ఫీచర్లు ఏంటంటే


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 15 , 2024 | 03:38 PM