Share News

Narzo 70 Pro: దేశంలో ఫస్ట్ సోనీ కెమెరాతో వస్తున్న నార్జో.. ధర, ఫీచర్లు ఏంటంటే

ABN , Publish Date - Mar 15 , 2024 | 02:35 PM

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే దేశంలో మార్చి 19న రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 70 Pro 5G మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Narzo 70 Pro: దేశంలో ఫస్ట్ సోనీ కెమెరాతో వస్తున్న నార్జో.. ధర, ఫీచర్లు ఏంటంటే

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే దేశంలో మార్చి 19న రియల్(Realme) మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 70 Pro 5G మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్లపై క్రేజ్ మరింత పెరుగుతోంది. అయితే అధికారికంగా ఈ ఫోన్ ధర ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. కానీ లీకైన సమాచారం ఆధారంగా ధీని రేటు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అయితే Realme Narzo 70 Pro 5G భారతీయ మార్కెట్‌లో ఇటివల విడుదల చేసిన iQOO Z9 5Gకు గట్టి పోటీ ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. iQoo Z9 భారతదేశంలో రెండు వేరియంట్‌లలో ప్రారంభించబడింది. 8GB + 128GB, 8GB + 256GBతో వస్తుండగా వీటి ధర వరుసగా రూ. 19,999, రూ. 21,999గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్‌ దేశంలోనే మొదటి సారిగా 50MP Sony IMX890 కెమెరాతో వస్తుంది. ఇది రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, ఎయిర్ గెస్చర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Narendra Modi: మహిళల విషయంలో ఆ నేతల ప్రవర్తనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

Updated Date - Apr 23 , 2024 | 09:20 AM