Share News

AP Politics: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:01 PM

పొన్నూరు(Ponnur) వైసీపీ(YCP) అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు(Ambati Murali Krishna) బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం(Election Commission). అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని..

AP Politics: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

గుంటూరు, ఏప్రిల్ 23: పొన్నూరు(Ponnur) వైసీపీ(YCP) అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు(Ambati Murali Krishna) బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం(Election Commission). అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.


వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదికను ఇవ్వాల్సిందిగా గుంటూరు కలెక్టర్‌ను సీఈవో ఆదేశించారు. కలెక్టర్ విచారణలో అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. దీంతో పొన్నూరు పట్టణ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల క్రితమే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినట్లు కూడా నిర్ధారించారు. దీంతో చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. అది వారం రోజులు గడవక ముందే మరోసారి అంబటి మురళిపై చర్యలకు ఆదేశించింది ఎన్నికల కమిషన్.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2024 | 10:01 PM