Share News

AP Politics: జగన్ కోసం కేజ్రీవాల్ వేయిటింగ్.. మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal).. ఏపీ సీఎం జగన్‌ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా కల్లూరు(Kurnool) అర్బన్ పరిధిలోని ఎన్టీఆర్ బిల్డింగ్స్‌లో టీడీపీ ..

AP Politics: జగన్ కోసం కేజ్రీవాల్ వేయిటింగ్.. మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..
Byreddy Rajasekhar Reddy

కర్నూలు, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal).. ఏపీ సీఎం జగన్‌ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా కల్లూరు(Kurnool) అర్బన్ పరిధిలోని ఎన్టీఆర్ బిల్డింగ్స్‌లో టీడీపీ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రభుత్వ మద్యం తాగి జనం పక్షవాతం, లివర్ డ్యామేజీతో చనిపోతున్నారని ఆరోపించారు.

జగన్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్కామ్స్‌ జరుగుతున్నాయని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఏపీ సీఎం జగన్‌ కోసం ఎదురు చూస్తున్నాడని అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఎక్కడుందో జగన్ చూపించాలని డిమాండ్ చేశారు బైరెడ్డి. వైసీపీ నాయకులు పేరు లేని మద్యం తాగి మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నట్లు అనుమానం వస్తోందన్నారు. రాయలసీమలో తాగడానికి నీళ్లు లేవని.. సీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే అసెంబ్లీలో చర్చించకపోవడం దుర్మార్గం అని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి అంటే జనానికి తెలియదని అన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఐదేళ్లలో ఆయన చేసింది శూన్యం అని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. కొండారెడ్డి బురుజు చుట్టూ ఎమ్మెల్యేలందరినీ నిలబెడితే జగన్ పది మంది ఎమ్మెల్యేల పేర్లను కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 10:21 PM